Mid Day Meals ; మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి..!
Mid Day Meals ; మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి..!
జగిత్యాల, (మన సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం చేబట్టిన జయశంకర్ బడిబాట కార్యక్రమములో బాగంగా మల్లాపూర్ మండలంలోని హుస్సేన్ నగర్ ప్రాధమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాన్ని జిల్లా విద్యాశాకాధికారి రాము ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి జీవితము లో ఏది సాధించాలన్న విద్య అతి ముఖ్యమని అలాంటి విద్యార్జనకు నాంది అక్షరాభ్యాసామని , ఇదే మీభవిష్యత్కు పునాది అయి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులను ఆశీర్వదించారు.
అలాగే మండలంలోని మొగిలిపేట ప్రాధమిక , ఉన్నత పాఠశాలలను , మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి జాగ్రత్తలు తెలియజేశారు , తాను పనిచేస్తున్న పాఠశాలలో తన పిల్లల్ని చేర్పించిన ఉపాద్యాయుడు రాజేందర్ ను అభినందించారు , ఉన్నత పాఠశాలలో ఎన్..యం.యం.ఎస్ స్కాలర్షిప్స్ కు ఎంపికైన విద్యార్థులను అభినందించారు . ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి , సెక్టోరియల్ అధికారి మహేష్, ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి , లక్ష్మన్న , శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
MOST READ NEWS :
-
District Collector : ఈవీఎంలు భద్రత.. గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్..!
-
Nalgonda : ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి.. చావు బతుకుల మధ్య తల్లి..!
-
Gold Price : ఆల్ టైం రికార్డ్.. ఇక గోల్డ్ కొనలేము..!
-
Plane Crash : విమానం నుంచి నేను దూకలేదు.. నేను ఎలా బ్రతికాను..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!









