Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : బాణాసంచా విక్రయాలపై జిల్లా ఎస్పీ కీలక ఉత్తర్వులు..!

Suryapet : బాణాసంచా విక్రయాలపై జిల్లా ఎస్పీ కీలక ఉత్తర్వులు..!

సూర్యాపేట, మన సాక్షి:

దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా విక్రయానికి సంబంధించిన అధికారుల నుండి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని జిల్లా ఎస్పీ శకే నరసింహా ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే క్రాకర్స్ విక్రయం జరగాలని,అనుమతి లేకుండా ఇతర ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయడం నిషిద్ధం అన్నారు.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర సంఘటనలను నివారించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ పేర్కొన్నారు. బాణాసంచా తయారీదారులు, సరఫరాదారులు, విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపవద్దు అని స్పష్టం చేశారు.

అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను పెట్టినట్లైతే వారిపై ఎక్స్-ప్లోజివ్ యాక్టు ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి ప్రమాదాలకు దూరంగా ఉంటూ ఉత్సవాలు సురక్షితంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.

MOST READ : 

  1. Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!

  2. By Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ..!

  3. Nalgonda : రూ.10 వడ్డీ.. రూ.50కోట్లు వసూలు.. చివరికి కటకటాల్లోకి..!

  4. District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!

మరిన్ని వార్తలు