ఆంధ్రప్రదేశ్Breaking Newsవిద్య

Doctorate : న్యూడిల్లీ భారత్ యూనివర్సిటీచే ఈశ్వరయ్యకు డాక్టరేట్..!

Doctorate : న్యూడిల్లీ భారత్ యూనివర్సిటీచే ఈశ్వరయ్యకు డాక్టరేట్..!

మదనపల్లి, మన సాక్షి:

కురబలకోట మండలం తెట్టు గ్రామం ఎనుములవారి పల్లెకు చెందిన బి. ఈశ్వరయ్యకు జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలోని భారత్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఆవార్డుతో ఘనంగా సత్కరించింది. ఇతను ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషివ్యాలీ స్కూల్ లో విద్యను అభ్యసించారు.

తర్వాత మదనపల్లె బీటీ కళాశాలలో డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఎంఏ బీఈడీ చేశారు. రిషివ్యాలీ రివర్ స్కూల్లో టీచర్ గా ఆతర్వాత హెడ్మాస్టర్ గా విధులు నిర్వహించారు. ఆతర్వాత నాంది పౌండేషన్ హైదరాబాదులో ఎడ్యుకేషనల్ రీసోర్సు పర్సన్ మేనేజర్ గా,హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో న్యూఢిల్లీలోని మధుర కేంద్రంగా జాతీయ స్థాయిలో ప్రిన్సిపాల్ గా , డైరెక్టర్ గా పనిచేశారు.

తదనంతరం న్యూఢిల్లిలోనే రాజీవ్ గాంధీ పౌండేషన్ లో సౌత్ ఇండియా హెడ్ గా పదేళ్ల పాటు పనిచేశారు. అంతేగాకుండా ఎన్సీఈఆర్టీలో రీసోర్సు పర్సన్ గా ఏడేళ్లుగా కొనసాగుతున్నారు. విద్యా రంగంలో ఇతని సేవలను గుర్తించి గత ప్రభుత్వం ఇతనికి రాష్ట్ర స్థాయిలో విద్యా సంస్కరణల కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రీపార్మ్స్ కమిటీలో రెగులేటరీ, మానిటరింగ్ కమిషన్ కమిటీ కీలక సభ్యుడిగా స్థానం కల్పించింది.

అప్పట్లో కేజీ నుండి పీజీ వరకు చదువు సంధ్యలు ఎలా ఉండాలన్న దానిపై ఈ కమిటీ గత ప్రభుత్వానికి నివేదిక సమర్పణలో కీలకంగా వ్యవహరించారు. తత్ఫలితంగా పాఠశాలల్లో నాడు-నేడు, నూతన సిలబస్, మధ్యాహ్న భోజనంలో మార్పులు. ఇద్దరు ఎంఈఓలు లాంటి విధి విధానాలు అమలు కావడానికి వీరి నివేదికే ఆధారంగా నిలచింది. రాష్ట్రంలోని అన్ని డైట్ కళాశాలలు తిరిగి పరిశీలించారు.

విద్యా రంగంలో ఇతని సేవలకు గాను నీతి అ యోగ్ పర్యవేక్షణలో నడిచే న్యూఢిల్లీలోని భారత్ వర్చువల్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్లు 2025 సంవత్సరానికి ఇతన్ని గౌరవ డాక్టరేట్ ఆవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ గౌరవ డాక్టరేట్ అవార్డు విద్యా వ్యవస్థ గొప్పతనమని ఈశ్వరయ్య తెలిపారు. పేదరికాన్ని జయించడానికి ఎవ్వ రైనా ఉన్నతంగా ఎదగడానికి చదువుకు మించిన ఆయుధం లేదన్నారు.

MOST READ : 

  1. ACB : డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు..!

  2. Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!

  3. Tea Snacks : టీతో ఈ స్నాక్స్ కలిపి తినకూడదు.. కారణం ఏంటంటే..!

  4. Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!

మరిన్ని వార్తలు