Hyderabad : గాంధీలో డాక్టర్ల డుమ్మా.. మంత్రి ఆకస్మిక పర్యటనలో వెలుగులోకి, శోకాజ్ నోటీసులకు ఆదేశం..!
Hyderabad : గాంధీలో డాక్టర్ల డుమ్మా.. మంత్రి ఆకస్మిక పర్యటనలో వెలుగులోకి, శోకాజ్ నోటీసులకు ఆదేశం..!
మన సాక్షి హైదరాబాద్
గాంధీ హాస్పిటల్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా డాక్టర్లు డుమ్మా కొట్టడంతో షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆయన నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకుని పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్, డీఎంఈని ఆదేశించారు.
ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను పరిశీలించి ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈకి మంత్రి ఆదేశించారు.
MOST READ :
-
Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
-
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!
-
Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!
-
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!









