TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : వారికి రైతు భరోసా ఇవ్వొద్దు.. సీఎం రేవంత్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..!

Rythu Bharosa : వారికి రైతు భరోసా ఇవ్వొద్దు.. సీఎం రేవంత్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రైతు భరోసా పథకం ఈనెల 26వ తేదీన ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. కాగా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు రైతు భరోసా పథకం పై పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

26వ తేదీ తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం ను సాగుకు యోగ్యమైన భూములకు, సాగు చేస్తున్న భూములు చెల్లించాలని ఆయన కలెక్టర్లకు ఆదేశించారు. పంట వేసినా వేయకున్నా సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందించాలని స్పష్టం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అన్హర్హులను గర్తించాలని ఆయన సూచించారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు