Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవిద్య

DOST : దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎల్లుండి ప్రారంభం..!

రాబోయే విద్యా సంవత్సరం (2026-27) కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

DOST : దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎల్లుండి ప్రారంభం..!

హైదరాబాద్, మన సాక్షి :

రాబోయే విద్యా సంవత్సరం (2026-27) కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మొదటి విడత

సీట్ల కేటాయింపు ప్రక్రియ ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు నిర్వహించబడుతుంది.అర్హులైన విద్యార్థులు రూ. 200 రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు అవకాశం కల్పించబడింది. మొదటి విడత సీట్ల కేటాయింపు మే 14న జరగనుంది. సీట్ల కేటాయింపు అనంతరం, విద్యార్థులు ఆన్‌లైన్ ‘సెల్ఫ్-రిపోర్టింగ్’ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

రెండవ విడత :

సీట్ల కేటాయింపు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15 నుండి మే 25 వరకు కొనసాగుతుంది. వెబ్ ఆప్షన్లను మే 15 నుండి మే 26 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ విడత సీట్ల కేటాయింపు మే 30న ప్రకటించబడుతుంది.

మూడవ విడత :

రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 31 నుండి జూన్ 15 వరకు జరుగుతుంది. వెబ్ ఆప్షన్లను జూన్ 16 వరకు నమోదు చేసుకోవచ్చు. మూడవ విడత సీట్ల కేటాయింపు జూన్ 20న జరగనుంది. రెండవ, మూడవ విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా సీట్ల కేటాయింపు తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

సీట్లు కేటాయించబడిన విద్యార్థులు తమ ప్రవేశ ప్రక్రియ (అడ్మిషన్) పూర్తి చేయడానికి జూన్ 20, జూన్ 27 మధ్య తమ సంబంధిత కళాశాలలకు స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. జూన్ 29, 30 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జూలై 1 నుండి తరగతులు ప్రారంభమవుతాయి.

ఇవీ చదవండి : 

మరిన్ని వార్తలు