Bitter guard: కాకరకాయ తింటున్నారా.. పొరపాటున కూడా ఈ ఆహారాలతో కలిపి తినకండి..!

Bitter guard: కాకరకాయ తింటున్నారా.. పొరపాటున కూడా ఈ ఆహారాలతో కలిపి తినకండి..!
మన సాక్షి:
కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన కూరగాయ. ఇది చేదుగా ఉన్నప్పటికీ, దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది, రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రోజూ కాకరకాయ తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలు దూరమవుతాయి. అయితే, కొన్ని ఆహార పదార్థాలతో కాకరకాయను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు లేదా మజ్జిగ : కాకరకాయ తిన్న వెంటనే పెరుగు లేదా మజ్జిగ తీసుకోకూడదు. వీటిలో ఉండే లాక్టిక్ ఆమ్లం కాకరకాయలోని పోషకాలతో కలిసి చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలకు కారణం కావచ్చు.
పాలు: కాకరకాయ, పాలు ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు. కాకరకాయలోని కొన్ని సమ్మేళనాలు పాలలో ఉండే ప్రోటీన్లతో చర్య జరిపే అవకాశం ఉంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం, కడుపు నొప్పి, మంట వంటి సమస్యలు వస్తాయి.
మామిడి: మామిడికాయను కాకరకాయతో కలిపి తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల వాంతులు, కడుపులో అసౌకర్యం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
బెండకాయ: కాకరకాయ, బెండకాయ రెండూ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవడం వల్ల కడుపుపై భారం పడుతుంది. దీని కారణంగా మలబద్ధకం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.
కాబట్టి, ఆరోగ్యంగా ఉండాలంటే కాకరకాయ తీసుకునేటప్పుడు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
By : Prashanth, Hyderabad
ఇవి కూడా చదవండి :
- Health: లంచ్ సమయంలో ఈ ఆహారం తిన్నారో.. అంతే సంగతులు..!
- Watermelon : తొక్కే కదా అని తీసి పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలూ వదలరు..!
- Hot Water : ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా.. ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..!
- Curd Rice : రోజూ పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
- Mango: కల్తీ మామిడిపండ్లను ఇలా గుర్తించాలి..!









