తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Penpahad : మూసీ నది నుంచి అక్రమ ఇసుక రవాణాకు ఎస్సై అడ్డుకట్ట.. ట్రాక్టర్లు వెళ్లకుండా కందకం..!

Penpahad : మూసీ నది నుంచి అక్రమ ఇసుక రవాణాకు ఎస్సై అడ్డుకట్ట.. ట్రాక్టర్లు వెళ్లకుండా కందకం..!

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో మూసి నుంచి అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎస్సై సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అక్రమ రవాణా జరగకుండా కందకం తొవ్వించారు. మండలంలో అక్రమ ఇసుక రవాణా కట్టడికై నాగులపహాడ్ , దోస పహాడ్ గ్రామాలలో ముసి నదిలోకి ట్రాక్టర్లు పోకుండా జెసిపి తో దారికి అడ్డంగా కందకం తోవటం జరిగిందని ఎస్ ఐ కస్తాల గోపికృష్ణ తెలిపినారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి సమయంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేయకుండా ముసి పరివాహక ప్రాంతంలో ఉన్న దోసపాడు మరియు నాగులపహాడ్ రాత్రి సమయములో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారంతో ఇసుక అక్రమ రవాణా చేయకుండా దోస పహాడ్ నాగులపహాడ్ గ్రామాల నుండి మూసి నది లోపలికి పోయే దారికి కంధకం కొట్టడం జరిగిందని తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై కస్తాల గోపికృష్ణ తెలిపారు.

MOST READ : 

  1. TG News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామ పాలన అధికారి పోస్టుల మంజూరుకు ఉత్తర్వులు జారీ..!

  2. TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..!

  3. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  4. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

మరిన్ని వార్తలు