TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Runamafi : రుణమాఫీ అయినా.. ఆ డబ్బులు చెల్లించాల్సిందే, బ్యాంకులకు వెళ్తే అసలు విషయం..!

Runamafi : రుణమాఫీ అయినా.. ఆ డబ్బులు చెల్లించాల్సిందే, బ్యాంకులకు వెళ్తే అసలు విషయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల రుణమాఫీని అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్న వారందరికీ మాఫీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేశారు.

మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులపై మాఫీ చేయగా, రెండవ విడతలో లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారు. ఇక మూడవ విడత రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల అప్పులను మాఫీ చేయనున్నారు. అందుకు కసరత్తు సైతం నిర్వహిస్తున్నారు.

మాఫీ అయిన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారు. వారి వారి సెల్ ఫోన్ కు మెసేజ్ లు సైతం బ్యాంకులో డబ్బులు జమ అయినట్లు వచ్చాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి సందేశం కూడా సెల్ ఫోన్ లకు చేరింది. అంతవరకు బానే ఉంది. రైతులు చాలా ఆనందంలో ఉన్నారు.

రుణమాఫీ కి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకులకు వెళ్లే రైతులకు అసలు విషయం తెలుస్తోంది. ప్రభుత్వం చెల్లించిన రుణమాఫీ డబ్బులు బ్యాంకులు తీసుకోగా ఇంకా వడ్డీ డబ్బులు చెల్లించాలని కొర్రి పెడుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసింది 2023 డిసెంబర్ మాసం వరకే అంటూ బ్యాంకర్లు పేర్కొంటున్నారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మాసాలకు సంబంధించిన వడ్డీని వసూలు చేస్తున్నారు. ఇక రెన్యువల్ రైతులకు రెన్యువల్ చేసి అమౌంట్ తీసుకుంటుండగా బ్యాంకు ఖాతాలు మూసివేస్తున్న రైతులు మాత్రం చేతి నుంచి అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.

బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు ఇటీవలనే మెసేజ్ వచ్చినప్పటికీ కేవలం డిసెంబర్ 2023 వరకు మాత్రమే రుణమాఫీ అయిందని, నాటి నుంచి వడ్డీ చెల్లించాలని పేర్కొంటున్నారు. దాంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి : 

Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!

మరిన్ని వార్తలు