Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణపండుగలు

Farmer Ganesh : వైరల్ అవుతున్న పొలం పనులు చేస్తున్న రైతు గణేశా.. ఫోటోలు..!

Farmer Ganesh : వైరల్ అవుతున్న పొలం పనులు చేస్తున్న రైతు గణేశా.. ఫోటోలు..!

మనసాక్షి ,కరీంనగర్ :

వినాయక చవితి సందర్భంగా గణేశుడి ప్రతిమలను భక్తజనాలు వివిధ రూపాల్లో ఉన్న ప్రతిమలను పూజిస్తుంటారు. ఒక్కోచోట ఒక్కో రకమైన గణేశుడి ప్రతిమలు మండపాల్లో పెట్టి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు.

కాగా ఈ క్రమంలోనే కరీంనగర్ పట్టణంలో ఏర్పాటైన రైతు గణేశుడి ప్రతిమలు వినాయకుడి మండపంలో పెట్టారు. ఇది అక్కడి వారినే కాకుండా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ఘన్ శ్యాంజీ చొరవ చూపి రైతు గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేయించారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

ఈ మండపంలోని వినాయకుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా, నాగలిపట్టి పొలం దున్నుతున్నట్లుగా, వరి పంట పండిస్తున్నట్లుగా.. పొలం పనులు చేస్తున్నట్లుగా వివిధ ప్రతిమలను ఏర్పాటు చేశారు. వినాయకుడు రైతుగా మారి పంటలు పండిస్తున్నట్లుగా.. ఈ ప్రతిమలు ఏర్పాటు చేయడంతో జీవ కళ ఉట్టిపడుతుంది.

శ్యామ్ జి గత ఐదు సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలతోనే వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కూడా 75 వేల రూపాయల ఖర్చు చేసి కలకత్తా నుంచి కళాకారులను తీసుకొచ్చారు. రైతు గణేశుడి మండపాన్ని తయారు చేయించి ప్రతిమలను తయారు చేయించారు.

గణేశుడి ప్రతిమలు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను కొంచెం కూడా ఉపయోగించకుండా పూర్తిగా మట్టితోనే తయారు చేయించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

మరిన్ని వార్తలు