Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం నిర్వహిస్తోంది. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులతో పాటు రాబోయే వానాకాలం సీజన్ కు సంబంధించి నిధులు కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యాసంగి సీజన్ లో 4 ఎకరాల లో పు రైతులకు రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలలో జమ చేశారు.
నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతు భరోసా ఇంకా అందలేదు. దాంతో రైతు భరోసా నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా వానాకాలం సీజన్ కూడా వచ్చింది. వానకాలం సీజన్ లో వరి నాట్లు వేయకముందే రైతు భరోసా నిధులు అందజేస్తామని (జూన్ 25వ తేదీ లోగా) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న రైతు భరోసా తో పాటు వానాకాలం సీజన్ కు సంబంధించి నిధులను ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ నెల 16వ తేదీన రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 16వ తేదీన రైతు భరోసా నిధులు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. రైతు భరోసా నిధులు విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా పండగ జరుపుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలు ఉండగా 1500 వేదికలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉంది. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నవారు. అయితే మిగతా 1101 రైతు వేదికల్లో కూడా వీసీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేసింది.
MOST READ :
-
District collector : చెన్నై, బెంగళూరుకు అంజీర ఎగుమతి.. సాగు పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఆ రైతుకు సన్మానం..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.8 వేలు..!









