తెలంగాణBreaking Newsనాగర్ కర్నూల్ జిల్లా

యూరియా కోసంహైదరాబాద్- శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన..!

యూరియా కంపెనీలో కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం మండల కేంద్రంలోని హైదరాబాద్- శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు.

యూరియా కోసంహైదరాబాద్- శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన..!

వెల్దండ, మన సాక్షి:

యూరియా కంపెనీలో కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం మండల కేంద్రంలోని హైదరాబాద్- శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం సింగిల్ విండో కి 700 బస్తాల యూరియా వచ్చినట్లు తెలుసుకున్న రైతులు ఉదయాన్నే అక్కడకు చేరుకొని ఆన్లైన్లో బుకింగ్ చేద్దామను యూరియా బుకింగ్ కావడం లేదని, క్షణాల్లో యూరియా బస్తాలు అయిపోయాయాయని రైతులు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా కొంతమంది రైతులు తమ వద్ద స్మార్ట్ ఫోన్లు కూడా లేవని, తమకు బుకింగ్ చేసే విధానం కూడా తెలవదని పాత పద్ధతి ద్వారానే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. దీంతో సమాచారం అందుకున్న మండల వ్యవసాయ అధికారిని శోభారాణి, ఎస్సై కురుమూర్తి ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు.

సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, రైతులు వినోద్ రెడ్డి, తెలుగమల అంజయ్య, సిల్వేరు సత్తయ్య గౌడ్,చిలికేశ్వరం లక్ష్మయ్య, సత్తూరి బాల్ లింగం, చక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు