Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కాంటాలకై ఎదురుచూపు.. దళారులను ఆశ్రయిస్తున్న రైతులు..!

Suryapet : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కాంటాలకై ఎదురుచూపు.. దళారులను ఆశ్రయిస్తున్న రైతులు..!

అర్వపల్లి,  మన సాక్షి:

ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తే తీర చేతికి వచ్చే టైం కు వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు తప్ప దాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతులు గాలి వానలతో, కారు మబ్బులతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

జాజిరెడ్డిగూడెం కేంద్రంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ప్రారంభించి 15 రోజులు, దాటిన నేటికీ ఒక్క క్వింటా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు.  25 నుండి 30 రోజుల ముందు వరకు ధాన్యాన్ని కేంద్రాల వద్ద పోసి కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురుచూస్తున్నారు. మండల పరిధిలో 23 సెంటర్లు ప్రారంభించారు, వాటిలో ఐదు సెంటర్లు మాత్రమే కొనుగోలు ప్రారంభించారు, మిగతా సెంటర్లు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.

సెంటర్ తప్పకుండా వస్తుందన్న హామీతో రైతులు ధాన్యాన్ని ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద పోసి ఆరబెట్టి ఎదురుచూస్తున్నారు. అకాల వర్షంతో దాన్యం తడిసి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదో అని కొంతమంది ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కింటాకు 2320 రూపాయలు ఇస్తుండగా ప్రైవేట్ వ్యాపారస్తులకు 1800, రూపాయలకే రైతులు అమ్ముకుంటున్నారు.

క్వింటాకు 520 తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ఎప్పుడు కొంటారు, కాంటాలు ఎప్పుడు వేస్తారో, ఎప్పుడు ఎగుమతి చేస్తారో ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో, ప్రైవేట్ వ్యాపారస్తులకు విక్రయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
ప్రారంభించిన కేంద్రాలలో వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతులు అంటున్నారు.

అట్టహాసంగా మంత్రులు ఎమ్మెల్యే, చైర్మన్లు, వివిధ రాజకీయ నాయకులు ప్రారంభించినప్పటి ఆసక్తి, కాంటాలు వేయించడంలో చూపించండం లేదని , రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలకు ధాన్యం తడవకముందే కొనుగోలు ప్రారంభించాలని రైతులకు కోరుతున్నారు.

MOST READ :

  1. Groww: గ్రో రికార్డ్.. ఎన్‌ఎస్‌ఈలో 84 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు..!

  2. UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!

  3. Miryalaguda : నకిలీ షూరిటీ లు కోర్టు లో పెట్టినందుకు జైలు శిక్ష, జరిమానా..!

  4. Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)

  5. Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)

మరిన్ని వార్తలు