Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

మిల్లర్ల, దళారీల దోపిడీకి గురవుతున్న రైతులు..!

రోజుకో ధరను నిర్ణయిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను నిలువ దోపిడీ చేస్తున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ఏమీ పట్టనట్లుగా, చోద్యం చూస్తున్నారు తప్ప, రైతులకు అండగా నిలవడం లేదని ఇది చాలా దుర్మార్గం అని సీపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు.

మిల్లర్ల, దళారీల దోపిడీకి గురవుతున్న రైతులు..!

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు

గరిడేపల్లి, మన సాక్షి :

నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఎండనక వాననక రేయింబవుళ్ళు కష్టపడి పంట పండించి మిల్లర్ల దగ్గరకి దాన్యం అమ్ముకోవడం కోసం రైతులు వెళ్తే,ధాన్యం కొనుగోలు చేయకపోగా వారిని బిచ్చగాళ్ల కంటే హీనంగా హీనంగా చూస్తూ, ఇక్కడ నుండి వెళ్ళమని కసురుకుంటున్నారని, వారికి నచ్చిన విధంగా రోజుకో ధరను నిర్ణయిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను నిలువ దోపిడీ చేస్తున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ఏమీ పట్టనట్లుగా, చోద్యం చూస్తున్నారు తప్ప, రైతులకు అండగా నిలవడం లేదని ఇది చాలా దుర్మార్గం అని సీపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు.

గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామం లో జరిగిన సిపిఐ గ్రామ కమిటీసమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఈ వేసంగి పంట చేతికి రావడానికి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, అనేక రకాల తెగులు వచ్చినాకూడా ఎప్పటికప్పుడు క్రిమిసంహారక మందులను తెచ్చుకొని తెగుళ్ల బారి నుండి పొలాలను కాపాడుకొని పంట పండించి అమ్ముకొనటానికి వస్తే మిల్లర్లు, దళారీలు దోపిడీ చేస్తున్నారే తప్ప గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని ఆయన అన్నారు.

మిల్లర్లు ఒకే ధాన్యాన్ని రోజుకో ధర నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తుంటే ఈ అధికారులు కానీ ప్రభుత్వం గానీ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని,రైతులు దోపిడీకి గురవుతున్నా కూడా, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలోనే రైతులు గుర్తుకొస్తున్నారు తప్ప,ఎన్నికలలో రైతులతో ఓట్లు వేయించుకొని, ఆ తర్వాత రైతులను మర్చిపోవడం పరిపాటి మారిందదని ఆయన అన్నారు.

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం గాని రైతు ఏడ్చిన రాజ్యం గాని బాగుపడ్డ దాఖలాలు ఈ ప్రపంచంలో లేవని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని ఆయన అన్నారు. తమది రైతు ప్రభుత్వం గా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి రైతులు దోపిడీకి గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆయన అన్నారు.

ఇప్పటికే రైతులు దోపిడీ కి నిరసనగా రోడ్లమీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారని, ఈ దోపిడీ ఇదే విదంగా ఉంటే రైతులు ప్రతి రోజు రోడ్లమీదకి వస్తారని ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా దీనిని గుర్తించి తగిన చర్యలు తీసుకొని రైతులను కాపాడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కుందూరు వెంకటరెడ్డి, పోకల ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు తాళ్ల తిరుపయ్య,రైతు సంఘం నాయకులు మెండే వెంకటేశ్వర్లు, కట్ట నరసింహారావు, పోకల నరసింహారావు, గోధుముల ఈశ్వర చారి,షేక్ నబిసాహెబ్, గోధుమల వెంకటేశ్వర్లు, అచ్చయ్య,షేక్ పీరిసాహెబ్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు