BIG BREAKING : ముగ్గురు కొడుకులకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య..!
BIG BREAKING : ముగ్గురు కొడుకులకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య..!
శంకర్పల్లి: (మన సాక్షి):
ముగ్గురు కుమారులకు ఉరి వేసి చంపి .. తండ్రి సూసైడ్ చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి టంగుటూరుకి చెందిన నీరటి రవి (33) నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుండేవారు. వెయ్యికి రూ.3వేల ఇప్పిస్తానని రవి పలువురి వద్ద డబ్బు సేకరించినట్లు సమాచారం.
కాగా రవి వద్డ డబ్బు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. దాంతో రవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు సరిగ్గా డబ్బులు కట్టలేక అప్పుల పాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో పిల్లలకు ఉరి వేసి చంపేశారు. తానూ ఆత్మహత్య చేసుకున్నారు.
భర్త, పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సమయంలో భార్య పుట్టింటికి వెళ్ళింది. భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ALSO READ : Attack : వృద్ధ దంపతులపై కన్న కొడుకే విచక్షణ రహితంగా దాడి..!








