Fish Venkat : ఫిష్ వెంకట్ కు అండగా జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని..!

Fish Venkat : ఫిష్ వెంకట్ కు అండగా జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కుటుంబానికి జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని అండగా నిలిచారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకున్న వెంటనే ఆయన ఆధ్వర్యంలో స్థాపించిన సేవా సంస్థ 100డ్రీమ్స్ ఫౌండేషన్ ద్వారా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ తన కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు.
ఈ సందర్బంగా చందానగర్ పి ఆర్ కె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ కు వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన కుతూరు స్రవంతికి రూ.2 లక్షల చెక్కును హీరో కృష్ణ మానినేని అందజేశారు. ఈ సందర్బంగా హీరో కృష్ణ నాని మాట్లాడుతూ చిత్రపరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు.
100డ్రీమ్స్ ఫౌండేషన్ లో పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పమని అన్నారు. అవయవ దానంపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు.. ఒక్క నిర్ణయం ఒక జీవితం,” అని తెలిపారు.
MOST READ :









