Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

చేపలు పట్టేందుకు వెళ్లి.. నీటమునిగి యువకుడి మృతి..!

చేపలు పట్టేందుకు వెళ్లి.. నీటమునిగి యువకుడి మృతి..!

నాగిరెడ్డిపేట్, మన సాక్షి :

నాగిరెడ్డి పేట్‌ మండల కేంద్రంలోని గోపాల్‌పేట్ గ్రామానికి చెందిన యువకుడు వల్లెపు రాజేష్ ( 30 ) చేపలు పట్టెందుకు వెళ్లి చేపలు పట్టే క్రమంలో ప్రమాద వశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన‌ట్టు ఎస్సై రాజు తెలిపారు.

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… ‌గోపాల్ పేట్ గ్రామానికి చెందిన వల్లెపు రాజేష్ శుక్రవారం మధ్యాహ్నం తన స్నేహితుడు బూర్గుపల్లి లక్ష్మీ నారాయణ తో కలిసి గ్రామ సమీపం లోని కాశి రెడ్డి కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో రాజేష్ ప్రమాదవశాత్తు నీట మునిగినట్టు తెలిపారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

రాజేష్ వెంట ఉన్న లక్ష్మీ‌నారాయణ ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు‌ కాశిరెడ్డి కుంట కు వెళ్లి అతని ఆచూకీ కోసం గాలించగా శుక్రవారం రాత్రి వరకు అతని ఆచూకీ లభించ లేదు. దీంతో శనివారం అగ్నిమాపక సిబ్బంది జాలర్ల సహాయంతో‌ రాత్రి వరకు‌ గాలించినా రాజేష్ మృత దేహం జాడ‌ తెలియలేదు.

రెండు రోజుల తర్వాత ఆదివారం ఉదయం రాజేష్ మృతదేహం కాశిరెడ్డి కుంటలో నీటిపైన తేలిందని ఎస్సై తెలిపారు. మృతుని భార్య సుమలత ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు. మృతునికి భార్య సుమలత, ఇద్దరు ఆడకూతుర్లు రవళి, రష్మిక‌ ఉన్నారు.

ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!

మరిన్ని వార్తలు