జిల్లా వార్తలుBreaking Newsవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Former Registratio : ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఏ.డి.ఏ రమేష్ బాబు సూచన..!

తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు భూమి పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు (ADA) రమేష్ బాబు సూచించారు.

Former Registratio : ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఏ.డి.ఏ రమేష్ బాబు సూచన..!

తుంగతుర్తి, (మనసాక్షి):

తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు భూమి పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు (ADA) రమేష్ బాబు సూచించారు.

పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో రైతులు తమ పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ వెంట తీసుకురావాలని సూచించారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియను సమీప వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయం, విస్తరణ అధికారుల కార్యాలయం లేదా మీసేవ కేంద్రాల్లో పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన రైతులకు 12 అంకెల యూనిక్ ఐడీ నంబర్ అందజేయబడుతుందని, ఆ నంబర్ ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

ఈ నెల 27వ తేదీ లోపు ప్రతి రైతు తమ పాస్‌బుక్ ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్, సహాయ వ్యవసాయ అధికారులు జోష్ణ, సాయి, సృజన్, సంతోష్, మీసేవ నిర్వాహకులు మరియు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Rythu Bharosa : ఏడాదంతా రైతు భరోసా.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

  2. RSS : ఆర్.ఎస్.ఎస్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు.!

  3. Rythu Bharosa : ఏడాదంతా రైతు భరోసా.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

  4. TG News : పంచాయతీలకు గుడ్ న్యూస్.. ఆ నిధులు విడుదల..!

మరిన్ని వార్తలు