Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

రాష్ట్రస్థాయి సీఎం కబడ్డీ పోటీలకు ఎంపికైన గడ్డిపల్లి విద్యార్థిని..! 

రాష్ట్రస్థాయి సీఎం కబడ్డీ పోటీలకు ఎంపికైన గడ్డిపల్లి విద్యార్థిని..! 

గరిడేపల్లి, మనసాక్షి :

విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించటం ఎంతో గర్వకారణం. అలాంటి ప్రతిభను గరిడేపల్లి మండలం గడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అమ్మనబోయిన ఉషారాణి సీఎం కప్ బాలికల విభాగంలో కబడ్డీ క్రీడలో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు స్థానిక ప్రధానోపాధ్యాయురాలు ధీరావత్ నాగమణి తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెన్ పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన అమ్మనబోయిన నాగరాజు వీర కుమారి దంపతుల కుమార్తె అమ్మనబోయిన ఉషారాణి పాఠశాలలో పదో తరగతి విద్యను అభ్యసిస్తోంది. సీఎం కప్పు కబడ్డీ క్రీడలను గత నెల 22న గ్రామస్థాయి,28న మండల స్థాయి, ఈనెల 6న డివిజన్ స్థాయి,17న జిల్లాస్థాయిల్లో ఆయా పాఠశాలల, మండలాల, డివిజన్లో కబడ్డీ క్రీడలను నిర్వహించగా జిల్లా క్రీడలను సూర్యపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహించారు.

అంచలంచలుగా ప్రతి చోట ప్రతిభ కనబరిచిన ఉషారాణి రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు ఈ నెల 20న మహబూబ్నగర్ జిల్లా మక్తల్ గ్రామంలో జరగనుండగా రాష్ట్రస్థాయిలో కబడ్డీ క్రీడను ఆడటం కోసం ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉషారాణిని ఉపాధ్యాయులతో పాటు తాను అభినందిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా తోటి విద్యార్థులు బంధువులు మిత్రులు బాలికకు అభినందనలు తెలిపారు. ఇంత ప్రతిభ కనపరిచిన ఉషారాణి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని పలువురు కోరుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు