Godavari Flood Warning : గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, నిలిచిన రాకపోకలు..!
Godavari Flood Warning : గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, నిలిచిన రాకపోకలు..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
గోదావరి నది ఉగ్రరూపంతో ఉప్పొంగుతుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు గోదావరి ఉపనదుల నుంచి గోదావరి నదిలోకి ప్రవహిస్తున్నాయి. దాంతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
సోమవారం ఉదయం 11 గంటలకే 47.50 అడుగులకు నీటిమట్ట చేరింది. 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి మరింత వరద పోటెత్తనున్నది. ఇప్పటికే ధవలేశ్వరం ప్రాజెక్టు 75 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీకి నీటి వరద పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి 8 లక్షల 68 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది.
గోదావరి నది ఉపనదులు కూడా వరద నీటితో ఉప్పుపొంగుతున్నాయి. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం పుష్కర ఘాట్ ల వద్ద స్థానికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
చర్ల – దుమ్ముగూడెం మండలంలో వాగులు పొంగుతున్నాయి. చర్ల – గుంపల్లి మధ్య ఈత వాగు పొంగడంతో రహదారిపై వరదనీరు చేరుతుంది. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో ఆరు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి :
Godavari : గోదావరికి వరద ఉధృతి.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి నీటి విడుదల..!
Good News : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా చేసుకోండి..!










