Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!
Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరింది. గతంలో ఎన్నడు లేని విధంగా 85 వేల రూపాయల మార్కు కూడా దాటింది. అతి తక్కువ కాలంలో తులం బంగారం లక్ష రూపాయలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు.
మంగళవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం 11,500 పెరిగింది. సోమవారం కాస్త ఊరట కలిగించిన బంగారం ధర మంగళవారం భారీగా పెరిగి మహిళల ఆశల్లో నిరాశ కలిగించింది. బంగారం పెరుగుదలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లోని ఒడిదుడుకులు కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చును.
100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం సోమవారం 8,50,500 రూపాయలు ఉండగా
మంగళవారం 11,500 పెరిగి 8,62,000 రూపాయలు ఉంది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ కు సోమవారం 7,70,500 రూపాయలు ఉండగా మంగళవారం 10,500 పెరిగి 7,81,000 రూపాయలుగా ఉంది.
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 78,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 85,200 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి.
Similar News :









