Gold Price : బంగారం ధరలకు ఇక బ్రేక్.. ఈరోజు తగ్గిందెంత.. తులం ధర ఎంతంటే..!

Gold Price : బంగారం ధరలకు ఇక బ్రేక్.. ఈరోజు తగ్గిందెంత.. తులం ధర ఎంతంటే..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
బంగారం ధరలకు ఇక బ్రేక్ పడిందా..? వారం రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు చూస్తే అర్థమవుతుంది. తులం బంగారం ఒక లక్ష 3500 రూపాయలకు పైగా పెరిగిన ధర వారం రోజులుగా తగ్గుతూ వస్తుంది. దాంతో ధరలు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
ఈ రోజు తగ్గిందెంత :
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు మంగళవారం ఒక్కరోజే ఆరువేల రూపాయలు తగ్గి 10,01,500 రూపాయలు కాగా, 22 క్యారెట్స్ బంగారంకు 5500 తగ్గి 9,18,000 రూపాయలు ఉంది. ధరల తగ్గుదల వల్ల మహిళలు ఆనందంలో ఉన్నారు.
తులం ధర ఎంతంటే :
ఈరోజు మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల తులం బంగారం 24 క్యారెట్స్ ధర 1,00,150 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 91,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాలలో ని ప్రధాన పట్టణాలైనా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, వరంగల్, నల్గొండ, తిరుపతి , నెల్లూరు కర్నూలు పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.









