Breaking NewsTOP STORIESతెలంగాణ

Gold Rate : మహిళలకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంత అంటే..!

Gold Rate : మహిళలకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంత అంటే..!

మన సాక్షి :

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

గత వారంలో బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.78,000కి చేరుకుంది. రికార్డు ధరతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర రూ.800 తగ్గింది.ప్రధానంగా అంతర్జాతీయ అంశాల కారణంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణమే బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,230గా నమోదవగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790గా నమోదైంది. బంగారం ధరలు నేటికీ రికార్డు స్థాయికి చేరువలో ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఉన్న ధర కంటే బంగారం ధర పెరుగుతుందా.. లేదా తగ్గుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపావళి నాటికి బంగారం ధర రూ.80,000 దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాలను కొనుగోలు చేసేవారు ముఖ్యంగా బరువు, నాణ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి బంగారంపైకి మార్చుకోవచ్చు. దీనికి తోడు దసరా దీపావళి ధన త్రయోదశి పండుగ సీజన్ ప్రారంభం కావడమే దేశీయంగా బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం. మిగతా సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్‌లో బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీంతో దేశీయంగా బంగారం ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

LATEST UPDATE :

 

మరిన్ని వార్తలు