Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం కోసం పెద్దపీట వేస్తుందని, వ్యవసాయ యాంత్రీకరణ కోసం సబ్సిడీపై అందించే పరికరాలను రైతులు సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు.

రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ..!

చింతపల్లి. మనసాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం కోసం పెద్దపీట వేస్తుందని, వ్యవసాయ యాంత్రీకరణ కోసం సబ్సిడీపై అందించే పరికరాలను రైతులు సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని రైతులకు సబ్సిడీ పైన1 కోటి 16 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన వివిధ రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి వారు స్వయంగ
పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో వ్యవసాయ యాంత్రీకరణ కీలకపాత్ర పోషిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు అందిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగ పరుచుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయడం మూలంగా తక్కువ దిగుబడితోపాటు అధిక ఖర్చు మూలంగా రైతులు నష్టపోతున్నారని తెలిపారు.

కృత్రిమ మేదస్సు ద్వారా తయారైన యంత్రాలు వాడకం ద్వారా సాగు వ్యయం తగ్గడంతో పాటు ఉత్పత్తుల పెరుగుతున్నాయని తెలిపారు.
ప్రతి యంత్ర పరికరం పై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా దేవరకొండ డివిజన్ కి 1759 పనిముట్లు గాను 1కోటి 16 లక్షల రూపాయల సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారని రైతులు చింతించాల్సిన పని లేదు అన్నారు.
అదేవిధంగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామానికి ఒక్క వ్యక్తిని వ్యవసాయ రంగంలో వాలంటరీగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏ డి ఏ,శ్రీలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఎం ఏ ఓ లు రవి కుమార్, రహేన, లక్పతి, యాదగిరి, రాజు, శ్రావణ కుమారి, రావుల పాండు, డిప్యూటీ చైర్మన్ జువేరియా తబస్సుం,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పిఎసిఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మరుపాకల అరుణ సురేష్ గౌడ్,కౌన్సిలర్లు హన్మంత్ సాయిచంద్ర గౌడ్, అజయ్ , యువజన కాంగ్రెస్ నాయకులు వివిధ మండలాల రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ : 

  1. BIG BREAKING : ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, డ్రమ్ములో కుక్కి.. చివరికి ఆ కిరాతకుడు..!

  2. BIG BREAKING : ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, డ్రమ్ములో కుక్కి.. చివరికి ఆ కిరాతకుడు..!

  3. Breaking : జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం..!

  4. జనగామలో ఉద్రిక్తత.. లాటరీ ద్వారా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక..!

మరిన్ని వార్తలు