TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించనున్నది. యాసంగి రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సిద్ధమయింది.

Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించనున్నది. యాసంగి రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సిద్ధమయింది. రైతు భరోసాలో కీలక మార్పుల నేపథ్యంలో యాసంగి అందించాల్సిన రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత ఖాతాలలో జమ కానున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా శాటిలైట్ నివేదిక ఆధారంగా పంటలు సాగుచేసిన రైతులకే రైతు భరోసా నిధులు అందజేయనున్నారు.

ఇది ఇలా ఉండగా సంక్రాంతి పండుగ తర్వాత కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 నుంచి 80 వేల మంది రైతులు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినట్లు సమాచారం. దాంతో యాసంగి రైతు భరోసా కు 65 లక్షల మంది రైతులు అర్హులు కానున్నారు.

యాసంగి రైతు భరోసా కు సుమారుగా 10 వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే రైతు భరోసా అమలు చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా నిధులు విడుదల చేస్తే ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు వస్తాయని భావిస్తోంది. అందుకుగాను ప్రభుత్వం రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు ఎకరానికి 6000 రూపాయలను జమ చేయనున్నది.

MOST READ 

  1. Miryalagida : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఇవీ రిజర్వేషన్లు.. బీసీలకు ఎన్ని సీట్లు అంటే..!

  2. అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!

  3. TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఇకపై వారిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు..!

  4. DMHO : బస్తి దావఖాన తనిఖీ చేసిన DMHO.. కీలక ఆదేశాలు..!

  5. TG News : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో నూతన పథకం ప్రారంభం..!

మరిన్ని వార్తలు