TOP STORIESBreaking Newsవ్యవసాయం

New Scheme : రైతులకు శుభవార్త.. రూ.600 కోట్లతో కొత్త పథకం..!

New Scheme : రైతులకు శుభవార్త.. రూ.600 కోట్లతో కొత్త పథకం..!

మన సాక్షి ,తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి చర్యలు చేపట్టడంతో పాటు రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ అమలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల రూపాయల అప్పు ఉన్న రైతులందరి రుణాలు మాఫీ చేసింది. దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డు బ్రేక్ చేసింది.

గత ప్రభుత్వం రైతులకు అందజేసే సబ్సిడీ వ్యవసాయ పరికరాలను నిలిపివేసింది. దాంతో రైతులు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీ యంత్రాలను అందజేయాలని నిర్ణయించింది.

ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సబ్సిడీ యంత్రాలను రైతులకు అందజేస్తామని వెల్లడించారు. ఏడాదికి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వం తీసుకురానున్నది. ఒక్కో జిల్లాకు సుమారుగా 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.

రైతులకు రబీ సీజన్ నుంచి సబ్సిడీ యంత్రాల పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ట్రాక్టర్లకు దమ్ముగిళ్ళలు, నాగళ్ళు, గొర్లు, స్ప్రేయింగ్ మిషన్లు, తోటలలో కలుపు తీసే యంత్రాలు ఇతర వ్యవసాయ పరికరాలను రైతులకు సబ్సిడీపై అందజేయనున్నారు.

ఇప్పటికే ప్రభుత్వం సబ్సిడీ యంత్రాలు విషయంపై అధికారులను ఆదేశించింది. కాగా ఈ పథకం త్వరలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు