Rythu Bharosa : రైతు భరోసా రాని రైతులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా రాని రైతులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
రైతులకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు గాను తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. రైతు భరోసా పథకంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు జనవరి 26వ తేదీన శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా పథకాలను ప్రారంభించారు.
రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 6000 రూపాయలను ఆయా గ్రామాలలో రైతులకు వారి వారి ఖాతాలలో జమ చేశారు. తెలంగాణ లోని 32 జిల్లాలలో 563 మండలాలకు సంబంధించి 577 గ్రామాలలో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అందజేసింది. 577 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు సంబంధించిన 9,48,333 ఎకరాల భూమికి గాను 569 కోట్ల రూపాయలను రైతు భరోసా ద్వారా బ్యాంకులలో జమ చేసింది.
ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులకు రైతు భరోసా సహాయం అందలేదని అన్నదాతలు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దాంతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పథకం పై ఒక కీలక ప్రకటన జారీ చేశారు. రైతు భరోసా ద్వారా పంట పెట్టుబడి సహాయం జమ కాని రైతులను ఉద్దేశించి ఆయన ఒక తీపి కబురు చెప్పారు.
రైతు భరోసా పెట్టుబడి సాయం అందని రైతులకు రాబోయే మార్చి 31వ తేదీలోగా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయం అందజేస్తామని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం 54,280 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 72 వేల కోట్ల నిధులు వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు తెలిపారు. రైతులకు విద్యుత్ సరఫరా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
MOST READ :
-
UPI : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఫోన్ పే, జి పే వినియోగదారులు తెలుసుకోవల్సిందే..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
Nalgonda : రైతుబంధు కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తాడు..!
-
Rythu : యూరియా కోసం రైతుల కష్టాలు.. క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!









