తెలంగాణBreaking Newsహైదరాబాద్

Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వారికి బియ్యం ఎప్పటినుంచంటే..!

Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వారికి బియ్యం ఎప్పటినుంచంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి గుడ్ న్యూస్ తెలియజేసింది. జనవరి 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేషన్ కార్డులు జారీ చేశారు.

ఆ గ్రామంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కాగా వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. తాజాగా రేషన్ కార్డులు పొందిన వారందరికీ ఈనెల (ఫిబ్రవరి) నుంచి బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు గాను అధికారులు.. కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి కూడా బియ్యం పంపిణీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారికి కూడా మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. గ్రామ సభలో వారిని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం పంపిణీ చేసిన కార్డులు కులగణన సర్వే ఆధారంగా జాబితాను రూపొందించి కార్డులు పంపిణీ చేశారు.

కాగా గ్రామసభలలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి మార్చి 31వ తేదీల్లోగా కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

MOST READ : 

  1. District collector : గ్రామీణ మహిళలు జాతీయస్థాయి వ్యాపారవేత్తలుగా ఎదగాలి.. జిల్లా కలెక్టర్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపు.. వచ్చేది అప్పుడేనా..!

  3. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

మరిన్ని వార్తలు