TOP STORIESBreaking Newsవ్యవసాయం

RunaMafi : రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. వారికి మాత్రమే 4వ విడత మాఫీకి కసరత్తు..!

RunaMafi : రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. వారికి మాత్రమే 4వ విడత మాఫీకి కసరత్తు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ రాష్ట్రవ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికీ మూడు విడతలుగా రుణమాఫీ చేసినప్పటికీ ఇంకా అనేకమంది రైతులకు రుణమాఫీ అందలేదు. వివిధ కారణాలతో రుణమాఫీ కానీ రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన వారందరికీ రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది.

ఇప్పటికి అనేక మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. దాంతో అనేక చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు సైతం చేస్తున్నారు. రుణమాఫీ కానీ రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకు గాను రుణమాఫీ కానీ రైతుల నుంచి వ్యవసాయాధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. దాంతో పాటు వ్యవసాయ అధికారులు రుణమాఫీ కానీ రైతుల ఇంటింటికి వెళ్లి కుటుంబ సర్వే నిర్వహించారు. కుటుంబ నిర్ధారణ సుమారుగా ఇప్పటి వరకు 74% కు పైగా పూర్తయింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ లోపు 18 వేల కోట్ల రూపాయలను 22 లక్షల మంది రైతులకు మాఫీ చేసింది. కాగా అనేక మంది రైతులకు రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో, బ్యాంకు ఖాతాలలో తప్పులు దొర్లడం వల్ల మాఫీ పొందలేకపోయారు. అందుకు గాను మాఫీ పొందలేని రైతుల నుంచి వ్యవసాయ అధికారులు ఫిర్యాదులు స్వీకరించి, ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఆ తర్వాత వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరించి ఆధార్ కార్డులు, ఫోటోలను రైతు భరోసా యాప్ లో అప్లోడ్ చేశారు. ఇప్పటి వరకు నాలుగు 4.28 లక్షల మంది రైతుల నుంచి ఫిర్యాదులు రాగా 3.10 లక్షల మంది రైతులకు సంబంధించి కుటుంబ సర్వే పూర్తయినట్లు సమాచారం. ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అయిన 1.26 లక్షల మంది రైతులు ఇప్పటి వరకు లక్ష మంది రైతుల వివరాలు కూడా సరిచేసినట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 5.54 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందకపోగా 4.10 లక్షల మంది రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు యాప్ లో అప్లోడ్ చేశారు. ఇప్పటివరకు 74% ఇంటింటి సర్వే పూర్తయింది. ఈ నెలాఖరులోగా మరికొంతమంది రైతులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా కుటుంబ నిర్ధారణ పూర్తి అయిన రైతులకు మాత్రమే అక్టోబర్ మాసంలో రుణమాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. ఒక్కొక్క రైతుకు సుమారుగా లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ ఉన్నా.. వీరందరికీ 4000 కోట్ల రూపాయలకు పైగానే నిధులు అవసరం ఉంది. వీరందరికీ కూడా దసరా పండుగ వరకు నాలుగో విడతలో మాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా రేషన్ కార్డులు లేని వారిలో 1.18 లక్షల మంది రైతులు ఇప్పటివరకు వ్యవసాయ అధికారులను సంప్రదించలేదని సమాచారం. ఏది ఏమైనా నాలుగో విడతలో రుణమాఫీ నిధులు విడుదల చేసి అర్హత కలిగిన వారందరికీ దసరా లోగా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు