Obesity: స్థూలకాయులకు గుడ్ న్యూస్.. లావు తగ్గడం చాలా ఈజీ..!

Obesity: స్థూలకాయులకు గుడ్ న్యూస్.. లావు తగ్గడం చాలా ఈజీ..!
హెల్త్ , మన సాక్షి ఫీచర్స్ :
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు తోడ్పడే ఉత్పత్తులను అందించే ది గుడ్ బగ్ సంస్థ సహజసిద్ధమైన జీఎల్పీ-1 ఆధారిత అడ్వాన్స్డ్ మెటాబోలిక్ సిస్టంను ఆవిష్కరించింది. బరువు తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ చెబుతోంది. క్లినికల్ ట్రయల్ డేటా ప్రకారం దీనితో 90 రోజుల్లో బరువు 12.01 శాతం, 9.64 శాతం నడుం చుట్టుకొలత, బీఎంఐ 12.14 శాతం తగ్గాయని తెలిపింది.
అడ్వాన్స్డ్ మెటాబోలిక్ సిస్టం శరీరంలో జీఎల్పీ-1 స్థాయులను సహజసిద్ధంగా పెంచుతుంది. ది గుడ్ బగ్ దీన్ని అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. ఇది నెలకు రూ. 2,000 లేదా మూడు నెలలకు రూ. 5,000కు లభిస్తుంది. ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, రిటైల్ స్టోర్స్‌లో ఇది అందుబాటులో ఉందని సంస్థ చెబుతోంది.
“అధునాతనమైన గట్ మైక్రోబయోమ్ పరిశోధనలతో సహజసిద్ధమైన జీఎల్పీ-1 యాక్టివేషన్ ద్వారా బరువును తగ్గించే విధంగా ప్రొబయోటిక్స్, ప్రీబయోటిక్స్ మేళవింపుగా అడ్వాన్స్డ్ మెటాబోలిక్ సిస్టం రూపొందింది. బరువును తగ్గించే ఔషధాల సంబంధిత దుష్ప్రభావాలేమీ దీనితో ఉండవు.
ఇది 90 రోజుల్లోనే 12 శాతం వరకు బరువును తగ్గించగలిగే వినూత్నమైన సొల్యూషన్” అని ది గుడ్ బగ్ సహ వ్యవస్థాపకుడు కేశవ్ బియానీ తెలిపారు. “క్లినికల్ ట్రయల్స్‌లో దీనికి సంబంధించి సంతృప్తికరమైన, అర్థవంతమైన ఫలితాలు వచ్చాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఔషధాలకు ఇది ధీటుగా ఉంటుంది” అని మణిపాల్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఎం.కె.ఎన్. మనోహర్ తెలిపారు. “మైక్రోబయోమ్ సైన్స్ జీర్ణకోశ ఆరోగ్యంపైనే కాకుండా జీవక్రియ, మహిళల ఆరోగ్యం మొదలైన అంశాలపైనా ప్రభావం చూపగలదు.
మైక్రోబయోమ్‌పై పరిశోధనలు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. దీని సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు మేము నిర్విరామంగా కృషి చేస్తున్నాం” అని ది గుడ్ బగ్ సహ-వ్యవస్థాపకులు ప్రభు కార్తికేయన్ తెలిపారు.
ఆందోళనకరంగా ఊబకాయుల సంఖ్య :
భారత్‌లో వివిధ వయస్సుల వారిలో స్థూలకాయం సమస్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులతో మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) ప్రకారం మహిళల్లో దాదాపు 24 శాతం మంది, పురుషుల్లో 22.9 శాతం మంది స్థూలకాయులు ఉన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డేటా ప్రకారం 2021లో 18 కోట్ల మంది పైగా భారతీయులు అధిక బరువు లేదా స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 2050 నాటికి ఇది 40 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.
Reporting : Vishal, Hyderabad
Similar News :
-
Health : ఆటిసం.. చిన్నారుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేక పుస్తకం..!
-
Health : ఆటిసం.. చిన్నారుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేక పుస్తకం..!
-
Health : మెదడు చురుగ్గా ఉండాలా.. అయితే ఇలా చేయండి..!
-
Health : ఎండు చేపలా, పచ్చివా.. ఆరోగ్యానికి ఏవి మంచివి, గుండె జబ్బు వారికి..!
-
Eye Health : ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్లజోడును తప్పనిసరిగా మార్చాల్సిందే.. కంటి ఆరోగ్యం కోసం..!









