Miryalaguda : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మొబైల్ ద్వారా నగదు రహిత రైల్వే టికెట్..!
Miryalaguda : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మొబైల్ ద్వారా నగదు రహిత రైల్వే టికెట్..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు ఆధ్వర్యంలో గురువారం యూటిఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ తీసుకునే విధానం పైన రైల్వే ప్రయాణీకులకు అవగాహన కల్పించారు. క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం లేకుండా, యూటిఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరితగతిన టికెట్ తీసుకొని రైలు ప్రయాణం చేయ వచ్చునని అయన ప్రయాణీకులకు తెలిపారు.
అంతే గాకుండా ప్రతీ రైల్వే స్టేషన్ లో క్యూ ఆర్ కోడ్ సదుపాయం ఉందని, ప్రయాణీకులు నగదు రహిత ప్రయాణం చేసుకోవడానికి రైల్వే వెసులుబాటు కల్పించిందని తెలియజేశారు. మొబైల్ టికెటింగ్ అప్లికేషన్ మరియు నగదు రహిత టికెటింగ్ విధానం పైన ప్రయాణీకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.
ఈ అవగాహన కార్యక్రమలో పాల్గొన్న ప్రయాణీకులు మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరగా టికెట్ తీసుకునే అవకాశము ఉందని మరియు నగదు రహిత టికెటింగ్ పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవగాహన కార్యక్రమం లో నల్గొండ సెక్షన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ సతీష్, మిర్యాలగూడ కమర్షియల్ సూపర్వైజర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : కాంగ్రెస్‌వి 420 హామీలు.. బిఆర్‌ఎస్ ఆగ్రహం, గాంధీ విగ్రహానికి వినతి..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాని రైతులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Suryapet : ఎత్తిపోతల భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి.. భూసేకరణ కమీషనర్ ఆదేశం..!
-
Penpahad : యూరియా సరఫరాకు చర్యలు.. మనసాక్షి కథనానికి స్పందించిన వ్యవసాయ అధికారి..!









