Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. వరుసగా 13 రోజులు సెలవులే..!
Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. వరుసగా 13 రోజులు సెలవులే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో పాఠశాల విద్యార్థులకు ఒక్కసారిగా ఎగిరి గంతేసే శుభవార్త అందింది. వేసవి సెలవుల తర్వాత ఎక్కువ రోజులు వరుస సెలవులు రాబోతున్నాయి. దాంతో విద్యార్థులు ఆనందంలో ఉన్నారు. ఇక కుటుంబ సభ్యులు కూడా సెలవుల్లో టూర్స్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా హాలిడేస్ జాబితా వచ్చేసింది. దసరా పండుగకు ముందు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. దాంతో 13 రోజుల పాటు వరుసగా దసరా సెలవులు ప్రభుత్వం ఇవ్వనున్నది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు వరుసగా సెలవులు వచ్చాయి. అక్టోబర్ 4వ తేదీన పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుత సమాచారం మేరకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 13 రోజులు వరుస సెలవులు రాగా.. సెలవుల్లో మార్పులు చేర్పులు ఉంటే మరోసారి ప్రకటించనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో..
ఆంధ్రప్రదేశ్ లో కూడా దసరా సెలవులను అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రకటించింది. దసరా హాలిడేస్ ఏపీలో వరుసగా తొమ్మిది రోజులు రానున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలల్లో సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది.
MOST READ :
-
Urea : ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పిఎసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతన్న రైతులు.. (వీడియో)
-
Mosquito : దోమల ద్వారా వచ్చే వ్యాధులేంటో.. ఎప్పుడొస్తాయో తెలుసా.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!
-
Doctorate : ఆరెగూడం వాసికి ఓయు డాక్టరేట్.. గ్రామస్తులు హర్షం..!
-
Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!









