Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్

Cm Revanth Reddy : విద్యార్థులకు గుడ్ న్యూస్.. జాబ్ గ్యారంటీ కోర్సు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Cm Revanth Reddy : విద్యార్థులకు గుడ్ న్యూస్.. జాబ్ గ్యారంటీ కోర్సు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మనసాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మల్టీనేషన్ కంపెనీలతో పాటు అనేక కంపెనీలలో ఖాళీలు ఉన్నప్పటికీ సరైన నైపుణ్యం విద్యార్థుల వద్ద లేకపోవడం వల్ల ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. అందుకు గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా భావించారు.

విద్యార్థులకు జాబ్ గ్యారంటీ బి ఎఫ్ ఎస్ ఐ (BFSI) మినీ డిగ్రీ కోర్సును ఆయన ప్రారంభించారు. ఈ కోర్సు ద్వారా నైపుణ్య శిక్షణ పొందిన వెంటనే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. దీనిని ఈ ఏడాది 38 కాలేజీలలో పదివేల మంది విద్యార్థులకు అందజేయనున్నారు.

బుదవారం హైదరాబాద్ లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ భరోసా కలుగుతుందనే నమ్మకం ఈ కోర్సు ద్వారా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ

రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించింది అన్నారు. రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన నిరుద్యోగ సమస్య పోదని పేర్కొన్నారు. అందుకు యువతకు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కల్పిస్తే ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు.

అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. నూతన కోర్సు ఈ ఎఫ్ ఎస్ ఐ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ద్వారా విద్యార్థులకు రాబోయే రోజుల్లో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అన్నారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, కానీ నైపుణ్య లేకపోవడం వల్ల విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్నారు. ఆరు నెలల ఫీల్డ్ ట్రైనింగ్ తో సహా 25 వేల వేతనంతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు