Breaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : తెలుగు మహిళలకు శుభవార్త.. రూ.7700 రికార్డు స్థాయిలో తగ్గిన పసిడి ధర..!

Gold Price : తెలుగు మహిళలకు శుభవార్త.. రూ.7700 రికార్డు స్థాయిలో తగ్గిన పసిడి ధర..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

దీపావళి పండుగకు తెలుగింటి మహిళలకు శుభవార్త అందింది. పసిడి ధర భారీగా తగ్గింది శుక్రవారం నవంబర్ 1వ తేదీన బంగారం ధర ఏకంగా 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు రూ. 7700 తగ్గి రికార్డు సృష్టించింది. 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 7000 రూపాయలు తగ్గింది. గత పది రోజుల్లో ఇంత ధర తగ్గడం ఇదే రికార్డుగా నిలిచింది.

24 క్యారెట్స్ బంగారం అక్టోబర్ 31వ తేదీన 8,13,300 రూపాయలు ఉండగా రూ.7700 తగ్గి రూ.8,05,600 లకు చేరింది. 22 క్యారెట్స్ బంగారం అక్టోబర్ 31వ తేదీన 7,45,500 రూపాయల ఉండగా 7000 రూపాయలు తగ్గి 7,38,500 లకు చేరింది. అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 1 (శుక్రవారం) వరకు కూడా ఇంత భారీగా తగ్గడం ఇది మొదటిసారి.

హైదరాబాద్ లో బంగారం ధర వివరాలు

24 క్యారెట్స్ బంగారం

ఒక గ్రామ కు (అక్టోబర్ 31వ తేదీ)న 8133 రూపాయలు ఉండగా నవంబర్ 1వ తేదీన రూ.8,056 గా ఉంది.

8 గ్రాముల బంగారం ధర 616 రూపాయలు తగ్గి 64, 448 రూపాయలుగా ఉంది.

10 గ్రాముల ధర 770 రూపాయలు తగ్గి 80500 ఉంది.

100 గ్రాముల ధర రూ.7700 తగ్గి 8,05,600 రూపాయలుగా ఉంది.

22 క్యారెట్స్ బంగారం ధర :

ఒక గ్రామ కు అక్టోబర్ 31వ తేదీన 7455 రూపాయలుగా ఉండగా నవంబర్ ఒకటవ తేదీన 7385 గా ఉంది.

8 గ్రాముల ధర రూ.560 తగ్గి 59,080 రూపాయలుగా ఉంది.

10 గ్రాముల ధర 700 రూపాయలు తగ్గి 73850 రూపాయలుగా ఉంది.

100 గ్రాముల ధర 7వేల రూపాయలు తగ్గి 73,8500 ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు