Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హత ఉంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హత ఉంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నిరుద్యోగులకు శుభవార్త అందింది. పదవ తరగతి అర్హతతోనే కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. నారాయణపేట జిల్లా కోర్టులోనిజిల్లా న్యాయ సేవాదికార సంస్థ లో స్టెనో/ టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలపోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ రఫీ ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30 సాయంత్రం 5 గంటలలోగా చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా కోర్టు ప్రాంగణంలోనిన్యాయ సేవా సదన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆంగ్లంలో హయ్యర్ గ్రేడ్లో టైప్రైటింగ్లో ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
కంప్యూటర్ ఆపరేటర్ లో పరిజ్ఞానం లేదా అర్హత కలిగి ఉండాలనీ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించే ఎస్.ఎస్.సి పాస్ అయి ఉండాలని, అభ్యర్థులు 18 సంవత్సరంలు పూర్తి అయి సెప్టెంబర్ ఒకటి 2024 నాటికి 34 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపారు.
ఎస్సి, ఎస్ టి, బిసి, ఈ డబ్ల్యూ ఎస్లకు 5 సంవత్సరాల సడలింపు, వికలాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెను తెలంగాణ స్టేట్ అండ్ సబర్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులు దరఖాస్తుతో ఓ.సి, బి.సి. అభ్యర్థులు 800 రూపాయలు డిడి, ఎస్సి, ఎస్ టి అభ్యర్థులు 400 రూపాయలు డి.డి లతో ది సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నారాయణపేట పేరున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
పూర్తి వివరాలకు జిల్లా కోర్టు వెబ్సైట్(హెచ్టిటిపి//నారాయణపేట. డీకోర్ట్స్. జి ఓ వి. ఇన్) ద్వారా సంప్రదించాలన్నారు.
MOST READ :









