Applications : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!

Applications : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!
పెద్దపల్లి, మన సాక్షి :
సెప్టెంబర్ 27 లోపు క్రిస్టియన్ నిరుద్యోగ యువతకు ఉచితంగా ప్లంబర్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జె.రంగా రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఆదేశాల మేరకు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎస్.సి.సి.ఎల్, స్కూల్ బిల్డింగ్ , ఎన్టిపిసి గోదావరిఖని ద్వారా నిరుద్యోగ క్రిస్టియన్ మైనారిటీ యువతకు 90 రోజుల పాటు ప్లంబర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందని అన్నారు.
క్రిస్టియన్ / రోమన్ కాథలిక్ / ఆంగ్లో-ఇండియన్,సంబందిత తహసిల్దార్ గారి ద్వారా జారీ చేయబడిన బిసి-సి కుల ధృవీకరణ పత్రము తప్పనిసరిగా జత చేయాలని లేదా బాప్టిస్మ్ సర్టిఫికేట్ తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ రు.10/- ల బాండ్ పేపర్ తో తప్పనిసరిగా ఇవ్వాలని, అభ్యర్థుల వయసు 18 నుండి 45 లోపు ఉండాలని అన్నారు.
దరఖాస్తుదారుల తల్లి తండ్రుల సంవత్సర అదాయం రూరల్ లో రూ.1,50,000/- లక్షలు, అర్బన్ లో 2 లక్షలకు మించ కూడదని, 7 వ తరగతి చదివి ఉండాలని, అధార్ కార్డు / వోటర్ ఐ.డి. కార్డు తప్పని సరిగా కలిగి ఉండాలని, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలలో పైన తెలిపిన ప్లంబర్ కోర్సు లో ఇంతకుముందు శిక్షణ తీసుకొని ఉన్నవారు అర్హులు కారని , ఇతర వివరాలకు ఫోన్ నెంబర్లు 9963313318 లేదా 9000294176 నందు సంప్రదించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
MOST READ :
-
Police Commissioner : బతుకమ్మ, దుర్గామాత ఉత్సవాల భద్రతపై పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన..!
-
Miryalaguda : ఆ గ్రామాలలో.. నేడు పవర్ కట్.. వేళలు ఇవే..!
-
Miryalaguda : సెయింట్ జాన్స్ హెస్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు..!
-
Trump : H1B వీసా అంటే ఏమిటి.. ఎవరికి వస్తుంది.. ట్రంప్ సంచలన నిర్ణయం..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం..!









