మహిళలకు శుభవార్త.. వ్యాపార రంగంలో ప్రోత్సాహం, జిల్లా కలెక్టర్ ఆదేశం..!
మహిళలకు శుభవార్త.. వ్యాపార రంగంలో ప్రోత్సాహం, జిల్లా కలెక్టర్ ఆదేశం..!
పెద్దపల్లి, ధర్మారం, మనసాక్షి ప్రతినిధి :
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టండి. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు వాణిజ్య రంగంలో ప్రోత్సాహం కల్పించనున్నది.
పశు సంవర్ధక శాఖ పరిధిలో యూనిట్ల గ్రౌండింగ్ పై సంభందిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద జిల్లాలోని మహిళా సంఘాలచే పాడి పశువుల యూనిట్ లు, పౌల్ట్రీ ఫార్మ్ మొదలగు యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సంభందిత అధికారులతో పశు సంవర్ధక శాఖ పరిధిలో యూనిట్ల గ్రౌండింగ్ పై సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పశుసంవర్ధక శాఖ సహకారంతో ఏర్పాటు చేయాల్సిన వాణిజ్య యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాడి పశువుల యూనిట్ లు, పౌల్ట్రీ ఫార్మ్ మొదలగు యూనిట్లను సంఘాల ద్వారా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాలచే బల్క్ కూలింగ్ యూనిట్ల నిర్వహణకు గల అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.
అదేవిధంగా పశుసంవర్ధక శాఖ పరిధిలో జిల్లాలోని పశువులకు అందించాల్సిన చికిత్స సేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని, కృత్రిమ గర్భధారణ, అవసరమైన పశుగ్రాసం పెంపకం మొదలగు అంశాలు లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని, జిల్లాలోని పశు ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో తెరిచి ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి శంకర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Lion : సీసీ పూటేజీలో సింహం కనిపించింది.. భయాందోళనలో ప్రజలు.. (వీడియో)
రైతు భరోసా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా.. రుణమాఫీ లెక్కనేనా.!
Good News : మహిళలకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!
Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!









