TG News : దసరా పండుగ వేళ శుభవార్త.. రైతుల ఖాతాలలో రూ.10 వేలు జమ..!
TG News : దసరా పండుగ వేళ శుభవార్త.. రైతుల ఖాతాలలో రూ.10 వేలు జమ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు దసరా పండుగ సందర్భంగా శుభవార్త తెలియజేసింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు వ్యవసాయ భూముల్లో కూడా ఇసుక మేటలు వేయడంతో పంటలు దెబ్బతిన్నాయి.
దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు పలు జిల్లాలలో పర్యటించారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఇల్లు కూలిపోయిన వారికి, వరదల వల్ల ఇండ్లలో సామాగ్రికి నష్టం జరిగిన వారికి ఆర్థిక సహాయం ప్రకటించి వెంటనే అందజేశారు.
కాగా పంటలు దెబ్బతిన్న రైతులకు దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఎక్కువగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలలో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
సుమారుగా 79.57 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. ఇప్పటికే పంటలు దెబ్బతిన్న రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ నివేదిక ఆధారంగా రైతులకు ఎకరానికి 10వేల రూపాయల చొప్పున నష్టపరిహారంగా వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు.
LATEST UPDATE :









