Breaking Newsతెలంగాణ

TG News : సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

TG News : సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసి సుమారుగా ఏడాది కావస్తుంది. గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. అయితే సర్పంచ్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నిర్ణయాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించి చట్ట సవరణ చేసే అవకాశం ఉంది.

పంచాయతీ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉంటే అనర్హులుగా గుర్తిస్తారు. కేవలం ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే సర్పంచ్, జడ్పిటిసి, ఎంపీటీసీ లుగా పోటీ చేయాల్సి ఉంది.

ప్రస్తుత చట్టం ప్రకారం 1995 జూన్ 1 తర్వాత మూడో సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులుగా పరిగణించబడ్డారు. దాంతో ముగ్గురు పిల్లలు ఉన్న వారంతా స్థానిక సంస్థల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. పోటీ చేసే వారికి ఇద్దరు పిల్లల నిబంధన అనేది తొలగించి వెసులుబాటు కల్పించాలని భావిస్తుంది.

ఈ నిబంధనను తొలగించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని సమాచారం. అయితే అసెంబ్లీ సమావేశాల్లో కూడా చట్ట సవరణ చేసే విధంగా నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదే జరిగితే రాబోయే స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి, కార్పొరేటర్, కౌన్సిలర్ ల అందరికి కూడా ఇదే అవకాశం కల్పించనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతున్నందున ఈ సమయంలోనే పంచాయతీ, మున్సిపల్ చట్టాలను కూడా సవరించి ఎన్నికలకు సిద్ధం చేయనున్నట్లు సమాచారం. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం బీసీ గణన పూర్తికాగానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు