Runamafi : రుణమాఫీ పై ప్రభుత్వం ట్విస్ట్.. అందరికీ కాదు, ఇవీ మార్గదర్శకాలు..!
Runamafi : రుణమాఫీ పై ప్రభుత్వం ట్విస్ట్.. అందరికీ కాదు, ఇవీ మార్గదర్శకాలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర రైతాంగం రుణమాఫీ కోసం ఎదురుచూస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు రైతులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
ఇటీవల మంత్రి మండలి సమావేశంలో కూడా రుణమాఫీ ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు చేయాలని నిర్వహించారు. మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించారు. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం భారీ ట్విస్ట్ ఇచ్చింది. మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది.
రుణమాఫీ మార్గదర్శకాలు :
రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతే కాకుండా మొదటగా మహిళల పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయను న్నారు.
ఇక చిన్న మొత్తంలో రుణమాఫీని చేసిన తర్వాతనే పెద్ద అమౌంట్ ను మాఫీ చేయనున్నారు.
రెండు లక్షల రూపాయల పైబడి ఉన్న రుణాలు తీసుకున్న రైతులు రెండు లక్షల పైగా ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుంది.
రెన్యువల్ చేసిన రుణాలకు ఈ పథకం వర్తించదు.
అదేవిధంగా పిఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనున్నది.
అన్ని వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు ఈ మాఫీ వర్తిస్తుంది.
2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు తీసుకున్న అన్ని పంటలు నాకు రుణమాఫీ వర్తిస్తుంది.
ఒకవేళ ఎవరైనా రైతు తప్పుగా వివరాలు అందజేసి రుణమాఫీ తీసుకున్నట్లయితే డబ్బులు మళ్ళీ వారి వద్ద నుంచి ప్రభుత్వం రికవరీ చేయనున్నది.
ఇది కూడా చదవండి:
Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!
Cm RevanthReddy : పరీక్షలు వాయిదా ఎందుకు వేయమంటున్నారో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)









