Penpahad : రేపటి నుంచి గ్రామసభలు.. ఏ గ్రామంలో ఎప్పుడో తెలుసా..!
Penpahad : రేపటి నుంచి గ్రామసభలు.. ఏ గ్రామంలో ఎప్పుడో తెలుసా..!
పెన్ పహాడ్, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో 29 గ్రామ పంచాయతీలలో మంగళవారం 21 నుండి 24వ తారీకు వరకు జరుగు గ్రామ సభలకు తాసిల్దార్ ధారావత్ లాలు నాయక్ ,మండల అభివృద్ధి అధికారి జన్జనాల వెంకటేశ్వరరావు వెల్లడించారు.
సోమవారం ఇరువురు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ మండలంలో అధికారులను 4 టీంలు తో గ్రామసభలు నిర్వహించుట జరుగుతుంది అని అన్నారు. గ్రామాల గ్రామ సభల లో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పథకాలపై గ్రామ సభ ల లో చర్చ జరుగుతుందని వారన్నారు.
మంగళవారం 21వ తారీఖున చిన్న సీతారాం తండా, దుబ్బ తండ, జల్ మాల్ కుంట తండా, నాగుల పహాడ్, ముకుందాపురం, నారాయణ గూడెం, న్యూ బంజర హిల్స్, రంగయ్య గూడెం.
22వ తారీఖు బుధవారం ధర్మపురం, మాచారం, మహ్మదాపురం, తంగేళ్లగుడెం, గూడెపుకుంట తండా, మేఘ్య తండా, మరుసకుంట తండా, సింగారెడ్డి పాలెం.
23వ తారీకు గురువారం అనంతారం, ధూపహాడ్, పెన్పహాడ్, పొట్లపహాడ్ ,అన్నారం బ్రిడ్జి, చిన్నగారికుంట తండా ,దోస పహాడ్, లింగాల.
24 న అనాజిపురం, గాజుల మల్కాపురం, భక్తాలాపురం, సీదేళ్ల, నాగులపాటి అన్నారం, గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించబడుతుందని తాసిల్దార్ ధారావతులాలు నాయక్ తెలిపినారు. గ్రామసభలో ప్రజలు తప్పకుండా పాల్గొనాలని ఆయన ప్రజలను కోరినారు.










