జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Miryalaguda : గ్రూప్ వన్ ర్యాంకర్ కు సన్మానం..!

Miryalaguda : గ్రూప్ వన్ ర్యాంకర్ కు సన్మానం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం విడుదల గ్రూప్ వన్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించిన తేజవత్ అశోక్ నాయక్ ను బంజారా ఉద్యోగుల సంఘం, బంజారా సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు జైత్రం నాయక్, దశరథ్ నాయక్ లు మాట్లాడుతూ నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అశోక్ నాయక్ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. కాబోయే డిప్యూటీ కలెక్టర్ అశోక్ నాయక్ ను బంజారా నిరుద్యోగ యువతీ, యువకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వ గురుకులం పాఠశాలలో చదవి అశోక్ నాయక్ ర్యాంక్ సాధించి పలువురి మన్ననలు పొందడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, సీతారాం నాయక్, మత్రు నాయక్, రవీందర్ నాయక్, మక్ల నాయక్, శంకర్ నాయక్, నాని నాయక్, జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ర్యాంక్.. వినీషా..!

  2. Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!

  3. Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !

మరిన్ని వార్తలు