BREAKING : జిల్లా కలెక్టర్ గన్ మెన్ తన కుటుంబ సభ్యులను కాల్చి.. తాను ఆత్మహత్య..!
BREAKING : జిల్లా కలెక్టర్ గన్ మెన్ తన కుటుంబ సభ్యులను కాల్చి.. తాను ఆత్మహత్య..!
– సిద్దిపేట జిల్లాలో విషాదం
దుబ్బాక (సిద్దిపేట) మనసాక్షి :
సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొన్నది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ కుటుంబ సభ్యులను గన్ తో కాల్చి తాను కూడా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఏ ఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేష్ పీసీ నెంబర్ 2735, బ్యాచ్ 2013, జిల్లా కలెక్టర్ గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం అందాజా 11:00 – 11:15 గంటల మధ్య తన స్వగ్రామం అయిన చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో తన సర్వీస్ రివాల్వర్ తో కొడుకును, కూతురును, భార్యను గన్నుతో కాల్చి, తను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ALSO READ : BIG BREAKING : తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు
ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆత్మహత్య గల కారణాలు తెలుస్తాయి. మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆకుల నరేష్ ఏఆర్ కానిస్టేబుల్ వయస్సు ఆకుల నరేష్(35), భార్య చైతన్య (30), కుమారుడు ఆకుల రేవంత్ (06) 1 వ క్లాస్, కూతురు ఆకుల రిషిత (05), లను తన సర్వీస్ గన్ తో కాల్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్టి ఆత్మహత్యపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : BREAKUNG : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలు..!









