Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

Haliya : హాలియాలో ఉచిత వైద్య శిబిరం.. ప్రారంభించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి..! 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా హాలియా పట్టణం లో మంగళవారం ఉదయం హాలియా పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీ తులసి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో 2K రన్ నిర్వహించారు.

Haliya : హాలియాలో ఉచిత వైద్య శిబిరం.. ప్రారంభించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి..! 

హాలియా, మనసాక్షి

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా హాలియా పట్టణం లో మంగళవారం ఉదయం హాలియా పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీ తులసి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో 2K రన్ నిర్వహించారు. శ్రీ తులసి హాస్పిటల్ సాగర్ రోడ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. మున్సిపల్ సిబ్బంది చేస్తున్న వైద్య పరీక్షలను స్వయానా పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మున్సిపల్ కార్యాలయం లొ శ్రీ తులసి హాస్పిటల్ వారి సౌజన్యం తో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం అభినందనీయం అని, మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ కమిషనర్, హాస్పటల్ యాజమాన్యాన్ని అభినందించారు.

ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎప్పటికి అప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్య రక్షణకై వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యం దెబ్బతింటే కోలుకోవడం కష్టమని, నేటి నుంచి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టి రేపటి సంతోషానికి పునాది వేయండి అని అన్నారు.

ఈ కార్యక్రమం లొ వైస్ చైర్మన్ రాజా రమేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారాయణగౌడ్,కమిషనర్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కౌన్సిలర్ల సలహాదారులు, శ్రీ తులసి హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ జనరల్ ఫిజీషియన్ గుండె, డయాబిటిస్, ఎముకల స్పెషలిస్ట్ లు పాల్గొని వైద్య పరీక్షలు చేసి, ఉచిత మందులు అందజేశారు.

మరిన్ని వార్తలు