Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Haliya : రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.. ఎస్ఐ సాయి ప్రశాంత్..!

అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు “99 రోజుల ప్రజా పాలన - ప్రణాళిక – అర్రివ్ అలీవ్ ” కార్యక్రమంలో భాగంగా సోమవారం హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

Haliya : రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.. ఎస్ఐ సాయి ప్రశాంత్..!

హాలియా, మనసాక్షి

అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు “99 రోజుల ప్రజా పాలన – ప్రణాళిక – అర్రివ్ అలీవ్ ” కార్యక్రమంలో భాగంగా సోమవారం హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ భాగంగా గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.

  • హైస్కూల్ సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం
  • రోడ్డు పక్కన పశువుల నిలిపే ప్రదేశాలను గుర్తించడం
  • రోడ్లపై వాహనాల తప్పు పార్కింగ్ నివారించడం
  • రోడ్లపై వరి ఎండబెట్టడాన్ని నిషేధించడం

అనంతరం సంబంధిత ప్రదేశాలను పరిశీలించి తక్షణ తాత్కాలిక చర్యలు చేపట్టామని ఎస్ఐ అన్నారు. హైవే రోడ్డు మార్గం లొ శాశ్వత పరిష్కారాల కోసం నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి లేఖ రాశామని తెలిపారు.అదేవిధంగా గ్రామస్థులందరూ 100% వాహన బీమా కలిగి ఉండాలని సూచించారు.

మద్యం సేవించి వాహనం నడపకూడదని (జీరో డ్రంక్ డ్రైవింగ్ ) గ్రామస్థులు అందరూ రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటిస్తూ, ప్రమాద రహిత గ్రామంగా కొత్తపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేయాలనీ ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ కార్యక్రమం తహసీల్దార్ చందర్ రావు (అనుముల), గ్రామ సర్పంచ్ బ్రాహ్మరెడ్డి,వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు,నేషనల్ హైవే ఏఈ సుష్మ,గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు