Hareesh Rao : రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్..!
Hareesh Rao : రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రైతు రుణమాఫీ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15లోగా పూర్తిస్థాయి 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి మాట తప్పారని అన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామంటే తాము ఒప్పుకోమని.. పాక్షికంగా రుణమాఫీ చేసినట్టు ఒప్పుకొని రైతులను క్షమించమని రేవంత్ రెడ్డి అడగాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతులకు 31 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారని, 47 లక్షల మందికి రుణమాఫీ చేస్తున్నట్లు ఆయన స్వయంగా చెప్పి, ఇప్పుడు కోత పెట్టారని అన్నారు. ఇప్పుడు కేవలం 17 వేల కోట్ల రూపాయల రుణమాఫీలు మాత్రమే చేశారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 14 వేల కోట్ల రూపాయలు కోత పెట్టి రుణమాఫీ అయిపోయిందని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.
ALSO READ :
Sand Booking : నేటి నుంచి ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్.. మన ఇసుక వాహన ద్వారా 48 గంటల్లో సరఫరా..!
Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
కరెంటు బిల్లుల చెల్లింపు పై కీలక ప్రకటన..!
Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!









