Harihara Veeramallu : ఢిల్లీ ఏపీ భవన్ లో హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన..!

Harihara Veeramallu : ఢిల్లీ ఏపీ భవన్ లో హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని రెండు రోజుల పాటు ఏపీ భవన్ లో ప్రదర్శిస్తున్నారు.
వారాంతపు సెలవు దినాలు అయన శని, ఆదివారాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారి కోసం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.
శనివారం రాత్రి 7 గంటలకు మొదటి షో వేయగా ఆడిటోరియం ప్రేక్షకులతో నిండిపోయింది. 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరో షో వేయనున్నారు. ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది.
MOST READ :
-
TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!
-
TG News : చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డిఎస్పీలు మృతి..!
-
Shadnagar : షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతుళ్లు మృతి..!
-
Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు.. లేటెస్ట్ అప్డేట్..!









