తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ గా పదోన్నతి..!

Suryapet హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ గా పదోన్నతి..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఆరుగురు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా వారు ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ నుండి ప్రమోషన్ ఆర్డర్ పత్రాలను అందుకున్నారు. ప్రమోషన్ పొందిన ఏఎస్ఐ లను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తన కార్యాలయం నందు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉద్యోగం లో పదోన్నతి పొందడంతో పాటు బాధ్యతలు పెరుగుతాయని బాధ్యతలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. క్రమశిక్షణతో ఉంటూ పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలన్నారు.. అనుభవాన్ని కొత్త గా వచ్చిన సిబ్బందికి నేర్పాలని కోరారు.

ప్రమోషన్ పొందిన వారిలో పి.శ్రీనివాసులు మెళ్ళచెరువు పీఎస్, పి. మల్లయ్య మద్దిరాల పిఎస్, జే.శ్రీనివాసు కోదాడ రూరల్ పియస్, ఖయ్యూమ్ కోదాడ ట్రాఫిక్ పీస్ , నరేందర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ సూర్యాపేట, సిహెచ్. వెంకన్న సీసీఎస్ సూర్యాపేట. ఉన్నారు.

ఈ కార్యక్రమం లో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం పోలీసు సంఘం జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రామచంద్ర గౌడ్ సెక్షన్ సూపర్టెండెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

LATEST NEWS : 

  1. District collector : కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు.. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!

  2. Nalgonda : ఆపరేషన్ స్మైల్.. 99 మంది బాలకార్మికులకు విముక్తి..!

  3. Budget: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

  4. Miryalaguda : అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం..!

మరిన్ని వార్తలు