TOP STORIESBreaking Newsజాతీయం

Srishailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు, పెరుగుతున్న నీటిమట్టం..!

Srishailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు, పెరుగుతున్న నీటిమట్టం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కర్ణాటక , మహారాష్ట్ర ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉప్పొంగడంతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీశైలం వైపు కృష్ణమ్మ వడివడిగా ఉరకలేస్తుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 317.420 మీటర్లు. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.498 టీఎంసీల నీరు ఉంది.

దాంతో జూరాల ప్రాజెక్టులోని ఐదు గేట్లను ఎత్తి శ్రీశైలంకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల రిజర్వాయర్ స్పిల్ వే నుంచి 19,615 క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 37,250 కేసకులు మొత్తం 56,865 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 810.90 అడుగులకు చేరింది. మరో రెండు రోజులపాటు ఇవే వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి : 

NagarjunaSagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!

కృష్ణమ్మ పరవళ్ళు.. తెరుచుకున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు.. త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద..!

తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!

మరిన్ని వార్తలు