Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటి విడుదల..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటి విడుదల..!
మన సాక్షి, నాగార్జునసాగర్
కృష్ణా నదిపై నల్లగొండ జిల్లాలో నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకలతో నిండుగా ఉన్నాయి.
దాంతో ఆలమట్టి ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది.
దాంతో నాగార్జునసాగర్ మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగకు విడుదల చేస్తున్నారు. 22 గేట్లు ఐదు అడుగుల మేర, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 2.53 లక్షల క్యూసెక్కుల నీరు వరద నీరు వచ్చి చేరుతుండగా, 2.69 లక్షల క్యూసెక్కుల నీటిని గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 585.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 298 టీఎంసీలు నీరు ఉంది.
ALSO READ :
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. రూ.5 కోట్లు అప్పు ఇస్తామని నమ్మించి, 60 లక్షలతో పరార్..!









